
ప్రమాదస్థలి వద్ద నందలూరు పోలీసులు
బి.కొత్తకోట : మండలంలోని జాతీయ రహదారి తుమ్మనంగుట్ట రైల్వేస్టేషన్ వద్ద బైక్‌ను కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. ములకలచెరువు మండలం బురకాయలకోట సమీప గండ్రాజులపల్లెకు చెందిన ముకుందరాజు (65), రామకృష్ణరాజు (68) గురువారం సాయంత్రం బైక్‌పై గ్రామం నుంచి మదనపల్లె వైపు వెళ్తున్నారు. వీరు తుమ్మనంగుట్ట రైల్వేస్టేషన్ సమీపంలోని రాగానే మదనపల్లె నుంచి ములకలచెరువు వైపు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధులకు తీవ్రగాయాలు కాగా వారిని చికిత్స కోసం 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
నందలూరులో..
నందలూరు(రాజంపేట) : నందలూరు–రాజంపేట మధ్య ఉన్న చెయ్యేరు బ్రిడ్జిపై గురువారం స్కూటీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌లపై ప్రయాణించిన ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. నందలూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడ్డవారిని 108 వాహనంలో రాజంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆటో ఢీకొని..
మదనపల్లె : ఆటో ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. అమ్మచెరువుమిట్ట జగన్‌కాలనీకి చెందిన ఎస్.బాబాజాన్(56) ద్విచక్రవాహనంపై వెళుతుండగా తట్టివారిపల్లె సమీపంలో ఆటో వెనుకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాబాజాన్‌ను స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్రంగా గాయపడ్డ ముకుందరాజు, రామకృష్ణరాజు