విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల తనిఖీ
కడప అర్బన్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం విజిలెన్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, పౌరసరఫరాల శాఖాధికారులతో కలిసి జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, అన్నమయ్య జిల్లా రాయచోటిలో పెట్రోల్ బంకులలో ఆకస్మిక తనిఖీ చేశారు.
● కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తేజా ఫిల్లింగ్ సెంటర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి లోపాలు కనిపించకపోవడంతో వెనుదిరిగారు. అలాగే కడప నగరం వినాయకనగర్‌లోని కె.ఎస్. చెట్టి అండ్ సన్స్, ప్రొద్దుటూరులో కూడా తనిఖీలు నిర్వహించారు. దీంతోపాటు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎస్.ఎన్ కాలనీలో శ్రీ సాయి బాలాజీ ఏజెన్సీ, శ్రీ సాయి రజిత ఫిల్లింగ్ స్టేషన్‌లలో తనిఖీలు చేశారు. పెట్రోల్ బంకుల యజమానులు నిమయ నిబంధనలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేయాలని విజిలెన్స్ అధికారులు సూచించారు. ఈ తనిఖీలలో కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి జి. శ్రీనివాసరావు స్వయంగా పాల్గొని సూచనలు చేశారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు ఎం. శివన్న, ఎన్. నారాయణప్ప, డీఈఈ ఏ.వీ. జవహర్‌రెడ్డి, ఏఈఈలు కె. విజయ్‌కిషోర్, వి.అశోక్‌కుమార్, డీసీటీఓ బి. గీతావాణి, ఎస్. ఖాజాహుసేన్, బి. బాబు మోజెస్, రమేష్‌రెడ్డి, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ రమేష్‌రెడ్డి, ఏఎస్‌ఓ తారకనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment