20 కిలోల గంజాయి స్వాధీనం
మదనపల్లె : పట్టణంలోని న్యూబైపాస్‌రోడ్డు చంద్రాకాలనీ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2.50 లక్షల విలువచేసే 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కొండయ్యనాయుడు తెలిపారు. శనివారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మీడియా సమావేశంలో గంజాయి నిందితుల అరెస్ట్‌కు సంబంధించి వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాలతో సీసీఎస్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశామన్నారు. పట్టణంలోని చంద్రాకాలనీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి ఫిబ్రవరి 21 శుక్రవారం దాడి చేశామన్నారు. ఈ దాడుల్లో స్థానికంగా గంజాయి విక్రయిస్తున్న బీకే.పల్లె మంజునాథకాలనీకి చెందిన గంటా భాగ్యమ్మ అలియాస్ ఆవుల భాగ్య(31), జెండాగుట్ట లక్ష్మీనగర్‌కు చెందిన మేసీ్త్ర ఆవుల అనిల్(27), అదే ప్రాంతానికి చెందిన ఆవుల శివమ్మ(24)లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి రూ.2.50 లక్షలు విలువచేసే 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇందులో మొదటి నిందితురాలు ఆవుల భాగ్యపై పలమనేరు, పుంగనూరు, పీటీఎం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు గంజాయి కేసులు నమోదయ్యాయని, జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. పలుమార్లు గంజాయి కేసులు నమోదవుతుండటంతో భాగ్యపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. మదనపల్లె పట్టణంలో గంజాయి, మాదకద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసుల ఫోన్ నంబర్లు.. 9491074519, 9440796741, 08571–222109, టోల్‌ఫ్రీనెంబర్.1972 కు తెలపాలన్నారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో సీఐలు రామచంద్ర, కళా వెంకటరమణ, ఎరీషావలీ, సత్యనారాయణ, ఎస్‌ఐలు రామకృష్ణారెడ్డి, రహీముల్లా తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
ఒకరిపై పీడీ చట్టం నమోదు
Comments
Please login to add a commentAdd a comment