రాయచోటి టౌన్: పవిత్రమైన రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని మండీల ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింలు అందరూ కలసి మెలసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులు భక్తిశ్రద్థలతో ఉపవాస దీక్షలు నిర్వహించడం, నమాజ్ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ముస్లింలకు మంత్రి మండిపల్లి, కలెక్టర్ శ్రీధర్ శుభాంక్షలు తెలియచేశారు.


