●రాకతోనే కోతలు మొదలు | - | Sakshi
Sakshi News home page

●రాకతోనే కోతలు మొదలు

Apr 2 2025 1:38 AM | Updated on Apr 2 2025 1:38 AM

●రాకత

●రాకతోనే కోతలు మొదలు

అభాగ్యుల పింఛన్ల కోత

కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో6,615 పింఛన్ల తొలగింపు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జూన్‌లో 2,23,436 పింఛన్లు

కూటమి ప్రభుత్వంలో ఏప్రిల్‌ పింఛన్లు 2,16,821

సచివాలయాల్లో చేసుకున్న దరఖాస్తులపై నిర్లక్ష్యం

బి.కొత్తకోట: ప్రభుత్వాలు ఏ పథకాన్ని అమలు చేసినా ఏనెలకానెల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది. ఇది సాధారణంగా జరిగేదే అయినా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్ల ప్రక్రియ తిరోగమనం బాట పట్టింది. ప్రతినెలా పింఛన్ల సంఖ్యలో కోతలు పెడుతూ వస్తోంది. కొత్త పింఛన్లు ఇవ్వని ప్రభుత్వం మనగడలో ఉన్న పింఛన్లపై పగ పట్టింది. వీటిపై ఆధారపడిన పేదలు ఇప్పుడు ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు. సచివాలయాల ద్వా రా దరఖాస్తులు చేసుకున్న వారికి దిక్కులేకుండా పోయింది. దీంతో కొత్త పింఛన్ల మంజూరు దేవుడెరుగు ఉన్న పింఛన్లు పీకేస్తున్నారంటూ పేదలు గగ్గోలు పెడుతున్నారు.

ఆధారం కోల్పోయి..

జిల్లాలో పింఛన్లు కోల్పోయిన లబ్ధిదారులు నెలనెలా అందే రూ.4వేల పింఛన్‌తో జీవనం సాగించేవారు వందలసంఖ్యలో ఉన్నారు. పింఛన్‌ సొమ్ము లబ్ధిదారులకు సామాజిక భద్రతను కల్పించేది. ఎవరి ఆదరణ ఉన్నా.. లేకున్నా నెలంతా పింఛన్‌ సొమ్ముతో జీవిస్తున్న వారి సంఖ్యకు కొదవలేదు. వైద్యం, నిత్యావసర వస్తువుల కోసం పింఛన్‌ సొమ్ము ను ఖర్చు పెట్టుకునేవాళ్లున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అర్హులైన పేదలకు అండగా నిలిచి పింఛన్లను నిరంతరంగా మంజూరు చేస్తూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా తయారైంది.

రూ.23 కోట్లు మిగుల్చుకున్న ప్రభుత్వం: జిల్లాలో పింఛన్లను కోతపెట్టిన ప్రభుత్వం గత 9 నెలల్లో అభాగ్యులకు అందించాల్సిన రూ.23.81 కోట్ల పింఛన్‌ సొమ్మును మిగుల్చుకుంది. గత జూలైలో 2,23,436 పింఛన్లు ఉండగా ఆగష్టు నెలలో 1,123 పింఛన్లను తొలగించారు. అక్కడినుంచి ప్రతినెలా కొంతమేరకు కోతవేస్తూ ప్రస్తుతం మొత్తం 6,615 పింఛన్ల తొలగింపు స్థితికి తీసుకొచ్చారు.

వాళ్లు చనిపోయారట: పింఛన్ల కోతపై ఓ అధికారి వింత సమాధానం విస్తుపోయేలా చేస్తోంది. ఒక సందర్భంలో పింఛన్ల కోతపై ఓ అధికారి వివరణ కోరితే.. వారు చనిపోతున్న లబ్ధిదారులని, అందుకే తొలగిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే గత ఆగష్టునెలలో 1,123 మంది చనిపోయారా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఆ అధికారి అభిప్రాయం ప్రకారం పింఛన్లు తొలగిపోతున్న వాళ్లంతా చనిపోతున్న వాళ్లే అయితే ఈ తొమ్మిది నెలల్లో తొలగించిన పింఛన్ల లెక్క మేరకు 6,615 మంది చనిపోయి ఉండాలి. చనిపోయిన వ్యక్తుల మరణ ధృవీకరణ లెక్కలు బయటకు తీస్తే ఈ లెక్క వస్తుందా అన్నది పెద్దప్రశ్న. ఇంతమంది చనిపోయే ఆస్కారం లేదని స్పష్టంగా తెలుస్తుంది.

ఆ దరఖాస్తులపై కక్ష

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే మూడు నెలల ముందునుంచే అర్హులైన పింఛన్‌దారులు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ దరఖాస్తులను సిబ్బంది ఆన్‌లైన్‌ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ దరఖాస్తుల పరిశీలన, మంజూరు చేసే ప్రక్రియ చేపట్టలేదు. దీనికితోడు ఆ దరఖాస్తుల స్థితి ఏమిటో కూడా దర ఖాస్తుదారులకు తెలియదు. వేలసంఖ్యలో చేస్తున్న దరఖాస్తుల వాస్తవ సంఖ్య తెలియకుండా సచివాలయాల్లో సేవలను నిలిపివేయడంతో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది.

పింఛన్ల కోత వివరాలు

జూన్‌ – 2024 2,23,436

జూలై – 2024 2,23,436

ఫిబ్రవరి – 2025 2,18,157

మార్చి – 2025 2,17,388

ఏప్రిల్‌ – 2025 2,16,821

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లపై దండెత్తింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చివరి నెల జూన్‌ ఒకటిన జిల్లాలోని లబ్ధిదారులకు 2,23,436 పింఛన్లు పంపిణీ చేశారు. ఇవే పింఛన్లు కొనసాగించాల్సిన ప్రభుత్వం ప్రతినెలా కోతలు విధించుకుంటూపోతోంది. గత జూలైలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను యధావిధిగా పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాతి నెలనుంచే కోతలు మొదలుపెట్టింది. దీనిఫలితంగా గత ఆగష్టు నెల నుంచి ప్రస్తుత ఏప్రిల్‌ దాక 6,615 మంది పింఛన్లను తొలగించారు. ఈ స్థాయిలో పింఛన్లు కోల్పోయిన నిరుపేదలు, అనాధలు, నిరాదరణకు గురైన అభాగ్యులు తమకిక దిక్కేది అంటూ ప్రశ్నిస్తున్నారు. భారీసంఖ్యలో పింఛన్లు తొలగిపోయినా అధికార కూటమి ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నయంగా పింఛన్ల మంజూరు చేపట్టలేదు.

●రాకతోనే కోతలు మొదలు 1
1/1

●రాకతోనే కోతలు మొదలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement