వరిపంటపై అడవి పందుల దాడి | - | Sakshi
Sakshi News home page

వరిపంటపై అడవి పందుల దాడి

Apr 11 2025 1:26 AM | Updated on Apr 11 2025 1:26 AM

వరిపం

వరిపంటపై అడవి పందుల దాడి

సుండుపల్లె : మండల పరిధిలోని సుండుపల్లె గ్రా మ పంచాయతీ గుట్టకాడ బలిజపల్లెకు చెందిన నంద్యాల సిద్దయ్య వేరుశనగ పంట పొలంపై బుధవారం రాత్రి సమయంలో అడవి పందులు దాడి చేశాయి. ఈ సందర్భంగా రైతు సిద్దయ్య మాట్లాడుతూ సర్వే నెంబర్‌ 105లో దాదాపు రెండు ఎకరాల వరిమడిని సాగు చేశానని తెలిపాడు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా అడవి పందులు దాడి చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు.

జిల్లాలోని 268 ఆలయాలకు అర్చకుల నియామకం

రామాపురం : అన్నమయ్య జిల్లాలోని 268 దేవాలయాలకు అర్చకులను నియమించనున్నట్లు జిల్లా దేవదాయ శాఖ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. గురువారం మండల పరిధి బండపల్లె , సూర్యనారాయణపురంలో శ్రీ మల్లాలమ్మ తల్లి ఆలయం గువ్వలచెరువు, ఓబుల్‌రెడ్డిగారిపల్లె, యర్రమరెడ్డిగారిపల్లె, రాచపల్లె, వడ్డెపల్లె, పర్వతరెడ్డిగారిపల్లె, నల్లగుట్టపల్లె, పాతపల్లి, కర్ణపువాండ్లపల్లె గ్రామాలలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అర్చకులు దేవాలయంలో సక్రమంగా పూజలు చేయకుండా ఉంటే అలాంటి వారిపైన ఫిర్యాదు చేస్తే తొలగిస్తామన్నారు.

చేబ్రోలు కిరణ్‌పై ఫిర్యాదు

సుండుపల్లె : మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని దుర్భాషలాడిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై వైఎస్సార్‌సీపీ రాజంపేట నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్దుల్లా, మండల సోషల్‌ మీడియా విభాగం నాయకుడు సయ్యద్‌ సల్మాన్‌లు సుండుపల్లె ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. అతని వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

వరిపంటపై అడవి పందుల దాడి   1
1/1

వరిపంటపై అడవి పందుల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement