పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
సిద్దవటం : ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి పంచాయతీలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న దుకాణ దారులకు శుక్రవారం డస్ట్‌బిన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుకాణదారులు చెత్తను చెత్తబుట్టల్లో వేసి ప్రతిరోజు గ్రామంలోకి వచ్చే హరిత రాయబారుల వాహనంలో చెత్తను వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి గ్రామాన్ని పరి శుభ్రంగా పెట్టుకోవాలని తెలిపారు. కాలుష్య నివారణ కోసం గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఒంటిమిట్టలోని కోందడ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జేఎంజే కాలేజీ నుంచి జాతీయ ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో బద్వేల్ డీఎల్‌పీఓ రమణారెడ్డి, ఏఓ ఖాదర్‌బాషా, గ్రామ కార్యదర్శి రాజేష్ స్థానిక నాయకుడు తుర్రా ప్రతాప్ పారిశుధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
డీపీఓ రాజ్యలక్ష్మి


