●నష్టపరిహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

●నష్టపరిహారం అందించాలి

Apr 16 2025 12:07 AM | Updated on Apr 16 2025 12:07 AM

●నష్టపరిహారం అందించాలి

●నష్టపరిహారం అందించాలి

రామాపురం: గాలివాన ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రాంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలో నష్టపోయిన పంటలను రైతు సంఘం నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో.. రైతాంగం మామిడి తోటలను బిడ్డల్లాగా పెంచుకుంటున్నారని తెలిపారు. అలాంటి తరుణంలో అకాల గాలివానతో చెట్లు వేర్లతో సహా నేలకు ఒరగడంతో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. బోర్ల కింద సాగు చేసిన పొద్దుతిరుగుడు, వరి పంటలు నేలమట్టం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు షబ్బీర్‌బాషా, శివారెడ్డి, లక్ష్మిరెడ్డి, కిరణ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, రామ్మోహన్‌, మదన్‌, యువరాజు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement