మిథున్‌ను ఎదుర్కోలేక కుట్రలు!
బి.కొత్తకోట: రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎంపీ మిథున్‌రెడ్డి విజయ పరంపరకు బ్రేక్ వేయాలని శత విధాలా ప్రయత్నించిన కూటమి నేతలు హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేకపోయారు. 2014 నుంచి హేమాహేమీలను ఓడించిన మిథున్‌రెడ్డిని నిలువరించి రాజంపేటలో పాగా వేయలేమని తేలడంతో వేధింపులతో బలహీనపర్చాలన్న కుట్రలను ప్రభుత్వ పెద్దలు తెరపైకి తెస్తున్నారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ప్రమాదంలో ఫైళ్లు కాలిపోతే వారు చేసిన అర్భాటం అంతా ఇంత కాదు. చివరకు పాలిగ్రాఫ్ పరీక్షల్లో ఆరోపణలు నిజంకాదని తేలిపోవడం వారికి మింగుడు పడలేదు. మదనపల్లె ఫైల్స్ వ్యవహారంతుస్సుమనడంతో ఇప్పుడు మద్యం కుంభకోణం అంటూ కొత్త ఆరోపణలను ముందుకు తెచ్చారు. ఈ ఆరోపణలతో రాజకీయంగా బలహీనపర్చాలన్న కుతంత్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కూటమి హవా కొనసాగినా రాజంపేట పార్లమెంట్ పరిఽధిలో కూటమి చతికిలపడటం ఆ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అధికారంలో ఉన్నాం కాబట్టి అప్రతిష్టకు గురిచేస్తే రాజకీయంగా లాభపడొచ్చన్న అంచనాతో కుయుక్తులతో ప్రభుత్వస్థాయిలో మిథున్‌రెడ్డిపై కుట్రలు పన్నుతున్నారు.
● కూటమి హవాలోనూ రాజంపేట ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలను కోల్పోవడం వెనుక మిథున్‌రెడ్డి మంత్రాగమే పనిచేసిందని కూటమి నేతలు మథనపడుతున్నారు. ఇప్పటికే మూడు ఎన్నికల్లో పెద్ద నేతలనే బరిలోకి దింపినా ఓటమి తప్పలేదు. అమ్ములపొదిలోని అస్త్రాలన్నీ వాడేయడం, అవి విఫలం కావడంతో వీరికి మించిన సమర్థులు వచ్చేఎన్నికల్లో లభించడం కష్టమే. దొరికినా మిథున్‌రెడ్డితో తలపడి గెలవడం అంటే ఆషామాషీ కాదు. అయినప్పటికి ఏదో సాధిస్తామన్న ఆశతో తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలతో మిథున్‌రెడ్డిని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
● 2014 ఎన్నికల్లో మిథున్‌రెడ్డి తొలిసారిగా వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసింది పురందేశ్వరితో. టీడీపీ, జనసేనతో ఉన్న పోత్తుతో మూడు పార్టీల అభ్యర్థిగా బీజేపీ తరపున బరిలో నిలిచారు. అయినప్పటికీ మిథున్‌రెడ్డి రాజకీయ వ్యూహం, పట్టుదల, ప్రజాభిమానం ముందు మాజీ సీఎం కుమార్తె పురందేశ్వరి ఓటమిపాలవ్వక తప్పలేదు. తొలి విజయంలో 1,74,762 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది. ఈ విజయంతోనే మిథున్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణ స్పష్టమైంది. 2019 ఎన్నికల్లో చిత్తూరుకు చెందిన ప్రముఖ నేత డీకే ఆదికేశవులు సతీమణీ డీకే సత్యప్రభ టీడీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవగా మిథున్‌రెడ్డి ఆమెను భారీ మెజార్టీతో ఓడించారు. ఊహించని విధంగా 2,68,284 ఓట్ల మెజార్టీ సాధించారు.
మాజీ సీఎంకు తప్పని ఓటమి
2024 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు పార్టీల కూటమి రాజంపేట ఎంపీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కిరణ్ నామినేషన్‌కు ముందు పలుమార్లు సర్వేలు చేయించుకుని బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో గెలవాలని వ్యక్తిగత ఆరోపణలను తెరపైకి తెచ్చారు. అవినీతి, అక్రమాలంటూ సభల్లో ఏకరువు పెట్టారు. చివరకు సొంత నియోజకవర్గం పీలేరులో తమ్ముడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డికి వచ్చిన మెజార్టీలో మూడోవంతులో ఒక వంతు కూడా దక్కలేదు. ఎమ్మెల్యే అభ్యర్థికి 25,081 ఓట్ల మెజార్టీ లభిస్తే..అన్న కిరణ్‌కు వచ్చిన మెజార్టీ 6,988 ఓట్లు.
● కూటమి హావాలో రాజంపేట పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్‌సీపీ మూడు అసెంబ్లీ స్థానాలను కై వసం చేసుకుంది. తంబళ్లపల్లె,పుంగనూరు, రాజంపేట ఎమ్మెల్యేలుగా పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి 10,103, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,095, ఆకేపాటి అమరనాఽథరెడ్డి 7,016 ఓట్లతో గెలుపొందారు. రాయచోటిలో విజయం తృటిలో తప్పింది.కేవలం 2,495 ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలిచింది. అయినప్పటికీ ఇక్కడ వైఎస్సార్‌సీపీకి అదరణ తగ్గలేదని నిరూపణైంది.
మూడు పార్టీలు ఏకమైనా ప్రత్యర్థికి తప్పని పరాభవం
రాజంపేట హ్యాట్రిక్‌గా నిలవడం జీర్ణించుకోవడం లేదు
తుస్సుమన్న మదనపల్లె ఫైల్స్..ఆపై తెరపైకి లిక్కర్ స్కామ్ ఆరోపణలు


