ఎలక్ట్రానిక్ వ్యర్థాల తొలగింపుపై అవగాహన
రాయచోటి: ఎలక్ట్రానిక్ వ్యర్థాల శాసీ్త్రయ తొలగింపుపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, ఎన్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా ఈ వ్యర్థాల సేకరణ జరుగుతుందని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రాయచోటి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాసీ్త్రయంగా తొలగించడం అనే కార్యక్రమౖంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. ప్రతి నెల మూడో శని వారం స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యర్థాల తొలగింపులో రెడ్యూస్, రీయూన్, రీసైకిల్ అనే ఆర్‌ఆర్‌ఆర్ సిద్ధాతాన్ని ప్రజలందరూ అవలంబించుకోవాలన్నారు. జిల్లాలోని 04 మున్సిపాల్టీలు, పెద్ద పంచాయతీల్లో ప్రతిరోజూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ జరుగుతుందన్నారు. మిగిలిన పంచాయతీలలో వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ జరుగుతుందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల రీసైక్లింగ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చన్నారు. రాయచోటి మున్సిపాల్టీ ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రంలో నేడు 170 కిలోల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించారన్నారు. వీటిని ప్రైవేటు కంపెనీలకు అందించి రీసైకిలింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి మున్సిపల్ కమీషనర్ వాసు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి


