నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈ నెల 21వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గంగమ్మా..కాపాడమ్మా
లక్కిరెడ్డిపల్లి: గంగమ్మా.. వర్షాలు కురిపించి.. కరుణించి కాపాడు తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మకు ఆదివారం భక్తులు బోనాలు సమర్పించారు.తలనీలాలు అర్పించారు. చుట్టు పక్కల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చిఅమ్మవారిని దర్శించుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అనారోగ్య బదిలీకి తాజా
సర్టిఫికెట్లు పొందాలి
రాయచోటి అర్బన్: అనారోగ్య కారణాలపై బదిలీని కోరుకునే ఉపాధ్యాయులు తాజా సర్టిఫికెట్లను పొందాలని డీఈఓ కె.సుబ్రమణ్యం తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామ రాజు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయులు తాజా సర్టిఫికెట్లు పొంది సమర్పించాల్సి ఉంటుందన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యా యుల బదిలీలు జరుగుతున్న దృష్ట్యా ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం సర్టిఫికెట్లు పొందిన వారు ప్రాధాన్యత కలిగిన వారిగా పరిగణింపబడతారన్నారు. అనారోగ్య కారణాలు చూపుతూ బదిలీకోరే ఉపాధ్యాయులకు ఈనెల 24 నుంచి 26వరకు కడప రిమ్స్‌లో ఏర్పాటు చేసిన అదనపు డైరెక్టర్లు, వైద్యవిద్య సూపరింటెండెంట్‌లు ధృవపత్రాలు జారీ చేస్తారన్నారు. శారీరక వైక ల్యం, 80 శాతం కంటే ఎక్కువ దృష్టిలోపం కలిగి ఉన్న, వినికిడి లోపం ఉద్యోగులు తాజా పత్రాలను పొందాల్సి ఉంటుందన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, అవయవ మార్పి డి, క్షయ,టీబీ, కిడ్నీమార్పిడి, డయాలసిస్ చికి త్స పొందుతున్నవారు సర్టిఫికెట్లను పొందాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి చిత్తూరుజిల్లా ఉపా ధ్యాయులు తిరుపతి ఎస్‌వీఆర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఉమ్మడి కడప జిల్లా ఉపాధ్యాయులు కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి వైద్య ధృవపత్రాలను పొందాలని ఆయన తెలిపారు.


