ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
మదనపల్లె సిటీ: తొమ్మిది నెలలుగా ఊరించిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు ఇచ్చారు. అయితే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయననున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులు మెటీరియల్ కోసం బుక్‌సెంటర్లు, కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అవనిగడ్డ, గుంటూరు, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ సెంటర్లలో చేరి వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈసారి డీఎస్సీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1473. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 705 పోస్టులు భర్తీ కానున్నాయి.
ప్రైవేటు పాఠశాల టీచర్లకు కలిసొచ్చిన వేసవి సెలవులు
జిల్లాలో చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడం.. వేసవి సెలవులు రావడం వారికి కలిసి వచ్చింది. దీంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా ఇది కలిసి వచ్చింది.
జిల్లాల వారీగా పోస్టులు వివరాలు:
ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 705 ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్, మున్సిపాలిటీ పరిధిలో భర్తీ కానున్నాయి. ఇందులో 407 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు , 298 ఎస్‌జీటీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1473 టీచరు పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్, మున్సిపాలిటీ పరిధిలో భర్తీ కానున్నాయి. ఇందులో ఎస్‌జీటీ పోస్టులు 976 కాగా,స్కూల్ అసిస్టెంట్లు 497 పోస్టులు భర్తీ కానున్నాయి.
ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు...
సబెక్టు పోస్టులు
20 నుంచి...మే 15 వరకు..
ఈనెల 20వతేదీ నుంచి మొదలై ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 15 వరకు ఉంటుంది. జూన్ 6 నుంచి జులై 6వతేదీ వరకు సీబీటీ(కంప్యూటర్ బేస్‌డ్ టెస్టు) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు డీఎస్సీ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూలు, సిలబస నోటిఫికేషన కోసం వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు.
పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
మెటీరియల్ కోసం పరుగులు
ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 705 పోస్టుల భర్తీకి అవకాశం
ఎస్‌ఏ లాంజ్వేజ్ 34
ఎస్‌ఏ హింది 18
ఎస్‌ఏ ఇంగ్లీస్ 81
ఎస్‌ఏ మ్యాథ్స్ 44
ఎస్‌ఏ పీఎస్ 30
ఎస్‌ఏ బీఎస్ 53
ఎస్‌ఏ సోసియల్ 65
ఎస్‌పీ పిఈ 82
ఎస్‌జిటి 298
మొత్తం 705


