ఇరుగులమ్మా.. దీవించవమ్మా..
గాలివీడు : ఇరుగులమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం గాలివీడు మండలం, గోపనపల్లె గ్రామం పూజారి వాండ్లలో ఆదివారం నిర్వహిస్తున్న నల్లాబత్తుని వారి గురువు దేవర కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, స్థానిక ప్రజలు శ్రీకాంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికి ఆయన చేత ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహింపచేసి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల తరువాత నల్లాబత్తుని వంశీయులందరూ సమిష్టిగా కలసి పండుగ వాతావరణంలో ఘనంగా గురువు దేవర నిర్వహించుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఇరుగులమ్మ అమ్మవారి దయతో వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
ఆప్యాయంగా.. ఆత్మీయంగా..
వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ గురువు దేవర కార్యక్రమంలో ప్రజలందరినీ శ్రీకాంత్ రెడ్డి పేరు పేరునా.. ఆత్మీయంగా.. ఆప్యాయంగా పలకరించి మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ స్టేట్ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ జల్లా సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లె యదుభూషణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగభూషన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండి చిన్నరెడ్డి, వాటర్ షెడ్ చైర్మన్ బండి బసిరెడ్డి, వైస్ ఎంపీపీ రమేష్‌రెడ్డి, భూమా అమర్‌నాథరెడ్డి, సర్పంచులు ఉమాపతి రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, రామాంజులు రెడ్డి, ఉమా ప్రభాకర్, ఎంపీటీసీలు అమానుల్లా, చిన్నపురెడ్డి, మాజీ ఎంపీటీసీ చిన్నావుల చిన్నపు రెడ్డి, నాయకులు రమణా రెడ్డి, ఇటాచి రమణా రెడ్డి, నల్లా బత్తుని వెంకటరెడ్డి, భానుమూర్తి రెడ్డి, బండి బసిరెడ్డి, వల్లపు నగేష్ తదితరులు పాల్గొన్నారు.
40 ఏళ్ల తర్వాత గురువు దేవర
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న
గడికోట శ్రీకాంత్ రెడ్డి


