వయోజన విద్య నుంచి మినహాయించాలి
రాయచోటి అర్బన్ : వయోజనవిద్య నుంచి వెంటనే వీఓఏలను మినహాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.రామాంజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో వెలుగు వీఓఏల సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పనిభారంతో అల్లాడుతున్న వీఓఏలపై వయోజనవిద్య భారాన్ని మోపడం దారుణమన్నారు. వీఓఏల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాణెమ్మ, రెడ్డెప్పలు మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎఫ్‌ఆర్‌ఎస్ చేయడం కష్టమన్నారు. ఈ మేరకు వారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వీఓఏల సంఘం నేతలు సుబ్రమణ్యం, రెడ్డెప్పరెడ్డి, రమణారెడ్డి, కృష్ణమ్మ, ఆనంద్, శివశంకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


