నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
రామాపురం : మండలంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధి సుద్దమళ్ల గ్రామం ఓబుల్‌రెడ్డిగారిపల్లెలో రూ.20 లక్షలతో తాగునీటి బోరు, పైప్‌లైన్ ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఓబుల్‌రెడ్డిగారిపల్లె గ్రామానికి బోర్‌తో పాటు 3 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌తో నీటి సౌకర్యం కల్పించామని, తాగునీటి సమస్య ఉన్న ప్రతి గ్రామాన్ని గుర్తించి నీటి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఓబుల్‌రెడ్డిగారిపల్లె స్కీమ్ బోరును మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభించి, కుళాయి వద్ద మహిళలకు బిందెలతో నీళ్లు పట్టించారు.


