జాతీయ సాంకేతిక సదస్సులకు ప్రాముఖ్యత
రాజంపేట : ఇంజనీరింగ్ విద్యలో జాతీయ సాంకేతిక సదస్సులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ దిశగా అన్నమాచార్య యూనివర్సిటీ ముందుకెళుతోందని అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి అన్నారు. కేఎస్‌ఆర్‌ఎంలో నిర్వహించిన సదస్సులో టెక్నికల్ సింపోజియం, ఏరా 2కె25 ప్రాజెక్టు ఎక్సో పేపర్ ప్రజెంటేషన్ ప్రదర్శించి రెండు జాతీయ సదస్సులలో ప్రతిభను చాటిన విద్యార్థినులు కీర్తి, హర్ష, వీణలను గురువారం అభినందిస్తూ జ్ఞాపికలను అభిషేక్‌రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబరెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ డా.నారాయణ, ఈఈఈ హెచ్‌వోడి పద్మలలిత తదితరులు పాల్గొన్నారు.


