
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : ఏళ్ల తరబడి పనిచేస్తున్న విద్యుత్తు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో శనివారం రాయచోటి పట్టణంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్కం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేయాలని, థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. అనంతరం కార్మికులకు విద్యుత్ శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈ యుగంధర్ మద్దతు తెలిపారు. డిమాండ్ల సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరి, ఏవీ.రమణ, రెడ్డప్ప, కిరణ్, శ్రీనివాసనాయుడు, అమరనాథరెడ్డి, రామాంజి, శ్రీనివాసులు, స్వాతి, సుజాత, సరస్వతి, నాగేష్‌గౌడ్, శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణ, సురేంద్ర, నారాయణ, కార్మికులు పాల్గొన్నారు.