‘జై భీమ్‌’ కొనసాగాలంటే | - | Sakshi
Sakshi News home page

‘జై భీమ్‌’ కొనసాగాలంటే

Sep 21 2025 1:29 AM | Updated on Sep 21 2025 1:29 AM

‘జై భ

‘జై భీమ్‌’ కొనసాగాలంటే

‘జై భీమ్‌’ కొనసాగాలంటే జగనన్న పాలన రావాలి

రాజంపేట: రాష్ట్రంలో జైభీమ్‌ నినాదం కొనసాగాలంటే జగనన్న పాలన రావడం తప్పనిసరి అని, ఆ దిశగా జగనన్న దళితఫోర్స్‌ సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజెఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. శనివారం ఆకేపాటి ఎస్టేట్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి అధ్యక్షతన జిల్లా ఎస్సీసెల్‌ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులను, సామాజిక అన్యాయాన్ని ప్రతి ఒక్క దళితుడు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.డిప్యూటీ సీఎం పవన్‌ నియోజకవర్గంలో దళితులను బహిష్కరణకు గురైన సంఘటనను ఆయన వివరించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మాదిగపల్లైపె దాడులు చేసిన తరుణంలో ప్రాణరక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నా ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పీపీపీ పద్ధతిలో మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే విధంగా తీసుకున్న నిర్ణయం వల్ల పరోక్షంగా సామాజిక అన్యాయం చేసినట్లే అని అన్నారు. కూటమి దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును చరిత్ర ఎన్నటికీ మరిచిపోదన్నారు. చంద్ర బాబు పాలనలో జరుగుతున్న సామాజిక అన్యాయంపై తిరుగుబాటుతప్పదన్నారు. సూపర్‌సిక్స్‌లో మూడు పథకాలతో దళితులకు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దళితుల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రాజకీయంగా, ఆర్ధికంగా దళితులను ఎదగడానికి జగనన్న పాలన దోహదపడిందని గుర్తుచేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వచ్చినా ఈ సారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యమని జోష్యం చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు ఎస్సీ కమిటీలను బలోపేతం చేస్తామన్నారు. ఆదిశగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో మండల, గ్రామ, నియోజకవర్గ స్ధాయి కమిటీల నియామకం పూర్తవుతోందన్నారు. జిల్లాలో ఎస్సీ కమిటీలు పూర్తి చేయడంలో ముందంజలో ఉందని, ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి కృషి ఉందని కొనియాడారు. ఎస్సీల సంక్షేమాన్ని చంద్రబాబు మరిచారన్నారు. ఎస్సీ,ఎస్టీలను డిప్యూటీసీఎం చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. డీబీటీ విధానంలో రాష్ట్రంలో ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికే రూ.9,154 కోట్లు ఆర్ధిక ప్రయోజనం కల్పించారన్నారు. జగన్‌మోహనరెడ్డి మళ్లీ సీఎం చేసుకోవాలని, లేదంటే నష్టపోతామని దళిత సామాజికవర్గాలు గుర్తుంచుకోవాలన్నారు.

● ఎస్సీసెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కనకరావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనను, ఇప్పటి కూటమి పాలనను దళితలు బేరీజు చేసుకుంటున్నారన్నారు. బాబు పాలన దళితవర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో పెద్దపీట వేసినట్లు చెప్పారు జగనన్నకు దళితులు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజంపేటలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఎస్టీకి రిజ్వరుడ్‌ అయితే, దానిని మార్చి ఓసీ నేతకు కట్టబెట్టడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం సామాజిక అన్యాయం చేస్తోందని అవగతమవుతోందన్నారు.వైఎస్సార్‌సీపీ దళితనేతలు పులిసునీల్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు రంగాల కమలాకర్‌, నందలూరు మండల ఉపాధ్యక్షుడు నాయనపల్లె అనుదీప్‌, రమణ, చంద్ర, జయరామచంద్ర, మోహన్‌, తిప్పన దుర్గయ్య, అంజనప్ప, లింగం లక్ష్మీకర్‌, చిన్నయల్లయ్య, ఎముక దుర్గయ్య, నాగసుబ్బయ్య, భక్తుడు, రామ్మోహన్‌లు ప్రసంగించారు. అంతకుముందు రాజ్యంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌, దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు నివాళులు అర్పించారు. సమావేశంలో డీసీఎంస్‌ మాజీ చైర్మన్‌ దండుగోపి, ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చుక్కా అంజనప్ప, వైస్‌ఎంపీపీ బాబు, జెడ్పీటీసీ దాసరి పెంచలయ్య, కాకిచంద్ర, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళ కార్యదర్శి బీరంగి రేవతి, నేతలు బీఎం కుసుమకుమారి, జీ.నాగమణి, రాజంపేట ఎంపీపీ ఆరెళ్ల రమణమ్మ యాదవ్‌, రైల్వేకోడూరు నియోజకవర్గ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు తిప్పన దుర్గయ్య, రాయచోటి నియోజకవర్గ అధ్యక్షుడు అంకె ఆంజనేయులు,బూత్‌కమిటి నియోజకవర్గ అధ్యక్షుడు తిప్పన నాగభూషణం, రెడ్డయ్య, నాగరాజు, సురేష్‌, చలపతి, నాగరాజు,ఓబులేశు, ప్రసాద్‌,నాగయ్య, రెడ్డప్ప, ఆంజనేయులు,సాయికుమార్‌,సంతోష్‌, రామాంజులు, శ్రీనివాసులు, పవన్‌, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన ఎస్సీసెల్‌నేతలు, ఆకేపాటి ఎస్టేట్‌లోని ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీసెల్‌రాష్ట్ర అధ్యక్షుడు టీజెఆర్‌ సుధాకర్‌బాబు

దళితవర్గాలను చైతన్యవంతులు చేయాలి

ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై దళితవర్గాలను చైతన్యం చేయాల్సిన బాధ్య త ఎస్సీ, ఎస్టీ అనుబంధ సంఘాల నేతలపై ఉంది. కూటమి ప్రభుత్వం పాల నలో విఫలమైంది. దళితులు ఎప్పుడూ వైఎస్సార్‌కుటుంబానికి వెన్నుదున్నగా ఉంటారన్నారు. దివంగత వైఎస్సార్‌, పార్టీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే దళితులకు ఎనలేని అభిమానం.

–ఆకేపాటి అమరనాఽథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట

కార్యకర్తలకే పెద్దపీట

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పెద్దపీట. జగన్‌ 2.0 పాలన తప్పకుండా వస్తుంది. దళితుల అభ్యున్నతి జగనన్నతోనే సాధ్యం. సమష్టి కృషితో జగన్‌ను మరోసారి సీఎం చేసుకుందాం. అన్ని వర్గాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవడం చంద్రబాబు నైజం. దళితులకు వైఎస్సార్‌, జగన్‌ల హయంలోనే న్యాయం జరిగింది. –గడికోట శ్రీకాంత్‌రెడ్డి,

రాష్ట్ర ప్రధానకార్యదర్శి, వైఎస్సార్‌సీపీ

కూటమి పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయి

కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయి.రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత దళితులు, మైనార్టీలు, పేదలపై ఉంది. –నిసార్‌ అహమ్మద్‌, ఇన్‌చార్జి, మదనపల్లె

కూటమి పాలనలో సామాజిక అన్యాయం

సూపర్‌సిక్స్‌ పథకాలతో దళితులకు గుండుసున్న

వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు

‘జై భీమ్‌’ కొనసాగాలంటే 1
1/4

‘జై భీమ్‌’ కొనసాగాలంటే

‘జై భీమ్‌’ కొనసాగాలంటే 2
2/4

‘జై భీమ్‌’ కొనసాగాలంటే

‘జై భీమ్‌’ కొనసాగాలంటే 3
3/4

‘జై భీమ్‌’ కొనసాగాలంటే

‘జై భీమ్‌’ కొనసాగాలంటే 4
4/4

‘జై భీమ్‌’ కొనసాగాలంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement