
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం
రైల్వేకోడూరు అర్బన్ : కార్యకర్తలకే పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డితో కలిసి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
నియోజకవర్గంలోని పలు అంశాలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసేలా ఇన్‌చార్జులు, నాయకులు బాధ్యత తీసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. అన్ని కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించినట్లు తెలిపారు.