
కువైట్‌లో ములకలచెరువు మహిళ అవస్థలు
ములకలచెరువు : మండలంలోని నాయనచెరువుపల్లి పంచాయతీ పోకనాటువారిపల్లెకు చెందిన రమణప్ప భార్య నాగమణి మూడు నెలల క్రితం కువైట్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లింది. ఆమె భర్త రమణప్పకు అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో వెళ్లింది. అక్కడికి వెళ్లగానే అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. దీంతో అక్కడే ఆసుపత్రిలో చేరింది. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని అక్కడి కువైట్ యజమానులు పట్టించుకోవడం లేదు. ఇండియా నుంచి కువైట్‌కు పంపిన బ్రోకర్‌ను సంప్రదిస్తే రూ.2 లక్షలు ఖర్చు చేస్తే కువైట్ నుంచి ఇంటికి పిలిపిస్తామని చెబుతున్నాడంటూ రమణప్ప కంటతడి పెడుతున్నాడు. ఆరోగ్య సమస్య ఎక్కువైందని తనను ఇండియాకు పిలిపించాలని నాగవేణి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.