అక్రమాలకు చరమగీతం పలికే ఆయుధం డిజిటల్‌ బుక్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు చరమగీతం పలికే ఆయుధం డిజిటల్‌ బుక్‌

Sep 28 2025 7:16 AM | Updated on Sep 28 2025 7:16 AM

అక్రమాలకు చరమగీతం పలికే ఆయుధం డిజిటల్‌ బుక్‌

అక్రమాలకు చరమగీతం పలికే ఆయుధం డిజిటల్‌ బుక్‌

వైఎస్‌.జగన్‌ నేతృత్వంలో

న్యాయ యుద్ధానికి శ్రీకారం

ప్రతి కార్యకర్త మొబైల్‌లో

డిజిటల్‌ బుక్‌ యాప్‌ ఉండాలి

వైఎస్సార్‌సీపీ నాయకుల పిలుపు

రాయచోటి : అన్యాయాలు, అక్రమాలకు చరమ గీతం పలికే ఆయుధంగా డిజిటల్‌ బుక్‌ ఉంటుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ జగనమోహన్‌రెడ్డి ఆదేశాలకు డిజిటల్‌ బుక్‌ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు రాజకీయ వేదింపులపై న్యాయపోరాటం సాగించేందుకు డిజిటల్‌ బుక్‌ ఆయుధంగా పనిచేస్తుందన్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఛీజీజజ్ట్చీఛౌౌజు. ఠ్ఛీడటటఛిఞ. ఛిౌఝ, లోగానీ లేదా ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ నెంబరు 040–49171718 ద్వారా కార్యకర్తలు తమకు జరిగే అన్యాయాలు, రాజకీయ దాడుల వివరాల ఫొటోలు, ఆధారాలతో సహా అప్‌లోడ్‌ చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుట్ర చేసిన వారిని శిక్షిస్తామని పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన పూర్తిస్థాయి అక్రమాలకు, అరాచకాలకు నిలయంగా మారిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని, వ్యాపారులు కప్పం కట్టాలంటూ బెదిరించడం, వినకపోతే దాడులకు పాల్పడడం దారుణమన్నారు. సామాజిక మాధ్యమ కార్యకర్తపై నమోదైన కేసును సీబీఐ దర్యాప్తుకు చేరుకోవడం అధికారుల ఏకపక్ష వైఖరికి బలాన్నిస్తోందన్నారు. అభిమాని తన మొబైల్‌లో డిజిటల్‌ బుక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ప్రజలలోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాలను మానకపోతే కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, 29న మండల కేంద్రాలలో డిజిటల్‌ బుక్‌ ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా అవహేళన చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫయాజుర్‌ రెహమాన్‌, కొలిమి హరూన్‌బాషా, బేపారి మహమ్మద్‌ఖాన్‌, పల్లపు రమేష్‌, శ్రీనివాసులురెడ్డి, రియాజుర్‌ రెహమాన్‌, సాధిక్‌అలీ, షబ్బీర్‌, సుగవాసి ఈశ్వర్‌ ప్రసాద్‌, సుగవాసి శ్యామ్‌, విజయభాస్కర్‌, అంజనప్ప, ఖలీల్‌, బేపారి అసద్‌, కొత్తపల్లి ఇంతియా, పైరోజ్‌, బేపారిజబీఉల్లాఖాన్‌, బుజ్జిబాబు, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్‌ బుక్‌ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, రమేష్‌కుమార్‌రెడ్డి, తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement