దొమ్మరనంద్యాల గ్రామంలో వెలసిన చౌడేశ్వరి దేవి
జమ్మలమడుగు(వైస్సార్ కడప జిల్లా): పూర్వం ఒక దొమ్మర కుటుంబం గండికోటలోని పేటలో నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబికులు దొమ్మరాటల ప్రదర్శనలు ఇస్తూ గండికోటలోని రాజులకు అతఃపుర స్త్రీలకు వినోదం కలిగించేవారు. ఆ కుటుంబాల జీవనాధారం అదే కావడంతో వాళ్లు విచిత్రమైన విన్యాసాలు, అనేక సాహస కృత్యాలను ప్రదర్శలుచేస్తూ జీవనం సాగించేవారు.
(చదవండి: వేగంగా కోలుకుంటున్న ఆర్థిక రంగం)
ఎతైన గడను భూమిలోనికి పాతి దానొపై నుంచిని కాసేపు పొట్టకు ఆనించి తన రెండు చేతులకు చాపి పక్షివలె ఆకాశంలో కొంత సేపే విహరించి మళ్లి నేలపై వాలేవారు. అయితే అలా ఒక రోజు దొమ్మర కుటుంబంలోని ఒక వ్యక్తి అలాంటి విన్యాసం చేస్తూండగా గండికోటలోనితూర్పు వైపు ఉన్న ఒక పల్లెలో వాలబోతు ప్రమాదవశాత్తు మరణించాడు. అతని గొప్ప విన్యాసానికీ ముగ్దుడైన రాజు ఈపల్లెను దొమ్మరలకు జాగీర్థారుగా ఇచ్చాడు.
దీంతో ఆ పల్లె కాస్త దొమ్మరివారి నేలగా పిలిచేవారు. తదనంతరం కాలక్రమేణా దొమ్మర నంద్యాలగా మారిపోయింది. దొమ్మరనంద్యాల గ్రామం గండికోటకు ఈశాన్య దిశగా జమ్మలమడుగుకు సమీపంలో ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో గ్రామ తోగట వీర క్షత్రియులు, సాలెలు, తదితర కులాల వాళ్లు ఉన్నారు. అంతేకాదు వారు చేనేతనే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. ప్రతి ఏడాది గ్రామ తోగట వీర క్షత్రియుల కులదైవ మైన చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలను జరుపుతుంటారు.
(చదవండి: ఏపీ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment