శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: పౌర్ణమి రా.3.04 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: భరణి రా.10.34 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.9.04 నుండి 10.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.23 నుండి 9.11 వరకు తదుపరి ప.12.09 నుండి 12.57 వరకు, అమృత ఘడియలు: రా.6.05 నుండి 7.35 వరకు, కార్తీక పౌర్ణమి; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.08, సూర్యాస్తమయం: 5.21.
మేషం....ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృషభం...ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు.
మిథునం..పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఒక సమస్య తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.
కర్కాటకం...ుత్రుల నుంచి శుభవార్తలు. సొమ్ము సకాలంలో అందుతుంది. పనుల్లో విజయం. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
సింహం....రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కీలక మార్పులు.
కన్య..... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. ఆలయదర్శనాలు.
తుల....శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృశ్చికం...వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.
ధనుస్సు....ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం...కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం....శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వస్తులాభాలు.
మీనం....కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. పనుల్లో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment