
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.దశమి రా.1.43 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: మూల ఉ.11.23 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.9.50 నుండి 11.22 వరకు, తదుపరి రా.8.46 నుండి 10.18 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.27 వరకు, తదుపరి రా.10.59 నుండి 11.47 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.20, సూర్యాస్తమయం: 6.03.
మేషం: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలతో సతమతమవుతారు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.
కర్కాటకం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కొన్ని చర్చలు సఫలం. విద్యార్థులకు ఉత్సాహంగా గడుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
సింహం: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య: సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరించండి.
తుల: విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులు,మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
ధనుస్సు: పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. దైవదర్శనాలు.
కుంభం: వ్యవహారాలు మరింత వేగంగా సాగుతాయి. బంధువుల నుంచి సాయం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
మీనం: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment