Horoscope Today: ఈ రాశివారికి సన్నిహితుల నుంచి కీలక సమాచారం | Daily Horoscope On November 03, 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి సన్నిహితుల నుంచి కీలక సమాచారం

Published Sun, Nov 3 2024 9:44 AM | Last Updated on Mon, Nov 4 2024 12:24 PM

Daily Horoscope On November 03, 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, కార్తీక మాసం; తిథి: శు.విదియ రా.8.06 వరకు, తదుపరి తదియ; నక్షత్రం: అనూరాధ పూర్తి(24 గంటలు); వర్జ్యం: ఉ.9.46 నుండి 11.26 వరకు’ దుర్ముహూర్తం: సా.3.57 నుండి 4.45 వరకు; 
అమృత ఘడియలు: రా.7.51 నుండి 9.34 వరకు; రాహుకాలం :  సా.4.30 నుండి 6.00 వరకు; యమగండం : ప.12.00 నుండి 1.30 వరకు; సూర్యోదయం : 6.02; సూర్యాస్తమయం : 5.26; భగినీ హస్త భోజనం.  

మేషం: దూరప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు.

వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. విందువినోదాలు.

మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. యత్నకార్యసిద్ధి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

సింహం: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

కన్య: ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. కార్యజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

తుల: కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆస్తి వివాదాలు. సోదరులు, మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

వృశ్చికం: యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.

ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. మిత్రుల  నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

మకరం: కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. వాహనసౌఖ్యం.

కుంభం: సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. గత సంఘటనలు గుర్తుకువస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

మీనం: కుటుంబంలో చికాకులు. అరోగ్య సమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement