శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.తదియ సా.6.31 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: భరణి ఉ.6.05 వరకు, తదుపరి కృత్తిక తె.5.16 వరకు (తెల్లవారితే శుక్రవారం), వర్జ్యం: సా.5.40 నుండి 7.12 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.52 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: రా.2.55 నుండి 4.28 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.50, సూర్యాస్తమయం: 6.10.
మేషం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో కొత్త ఆశలు.
వృషభం: రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
మిథునం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కర్కాటకం: ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహం: వ్యయప్రయాసలు. మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. రాబడికి మించి ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
కన్య: కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.
తుల: ఉద్యోగయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.
వృశ్చికం: అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ తగ్గుతుంది..
ధనుస్సు: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బ«ంధువులతో తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మకరం: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో విరోధాలు. ఆలోచనలు కలసిరావు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.
కుంభం: శుభవార్తలు అందుతాయి. కార్యజయం. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
మీనం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటిలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
Comments
Please login to add a commentAdd a comment