ఈ రాశి వారి కష్టం ఫలిస్తుంది, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలం | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారి కష్టం ఫలిస్తుంది, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలం

Published Sat, Apr 6 2024 6:51 AM

Daily Horoscope: Rasi Phalalu On April 06 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, మార్గశిర మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.7.36 వరకు తదుపరి త్రయోదశి తె.5.13 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం: శతభిషం ప.1.29 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.7.28 నుండి 8.56 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.29 వరకు, అమృతఘడియలు: ఉ.6.44 నుండి 8.13 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: విద్యార్థులు సత్తా చాటుకుంటారు. బంధువుల కలయిక. వస్తులాభాలు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.

వృషభం: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. 

మిథునం: ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో శ్రమ. 

కర్కాటకం: కుటుంబసమస్యలు ఎదురవుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. .

సింహం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలలో లాభాలు దక్కే ఛాన్స్‌. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. 

కన్య: మీ కష్టం ఫలిస్తుంది. బంధువుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. 

తుల: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పనులలో అవాంతరాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులపై అదనపు బాధ్యతలు. .

ధనుస్సు: పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కార్యజయం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. 

మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు శ్రమపడాల్సిన పరిస్థితి. 

కుంభం: నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు.

మీనం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

Advertisement
Advertisement