Horoscope today: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి

Published Sun, Apr 14 2024 6:17 AM

Daily Horoscope: Rasi Phalalu On April 14 2024 In Telugu - Sakshi

శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.షష్ఠి ప.3.46 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: ఆరుద్ర లె .5.17 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి పునర్వసు, వర్జ్యం: ప.1.23 నుండి 3.01 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.20 వరకు, అమృతఘడియలు: రా.7.07 నుండి 8.06 వరకు. 

సూర్యోదయం        :  5.49
సూర్యాస్తమయం    :  6.11
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం. దైవచింతన.

వృషభం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మిథునం: నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలత. విచిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమా«ధిక్యం.

సింహం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

కన్య: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల:శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ.

వృశ్చికం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరం: మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

మీనం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

Advertisement
Advertisement