శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.దశమి రా.2.49 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పునర్వసు రా.10.47 వరకు, తదుపరి పుష్యమి,వర్జ్యం: ఉ.10.18 నుండి 11.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.31 నుండి 9.19 వరకు, తదుపరి రా.10.57 నుండి 11.45 వరకు,అమృతఘడియలు: రా.8.19 నుండి 10.05 వరకు.
మేషం: నూతన పరిచయాలు. సమాజంలో గౌరవం. విచిత్ర సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృషభం: మిత్రులతో కలహాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు నెలకొంటాయి.
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూలాభాలు. పనులు చకచకా సాగుతాయి. ధనప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.
కర్కాటకం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
తుల: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.
వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
ధనుస్సు: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మకరం: పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మీనం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment