ఈ రాశి వారి సమస్యలు తీరుతాయి, బంధువుల నుంచి ధనలాభం | Today Telugu Horoscope On March 2nd, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారి సమస్యలు తీరుతాయి, బంధువుల నుంచి ధనలాభం

Published Sat, Mar 2 2024 6:50 AM | Last Updated on Sat, Mar 2 2024 9:09 AM

Daily Horoscope In Telugu 02 03 2024 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.సప్తమి రా.3.33 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: విశాఖ ఉ.10.31 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.2.40 నుండి 4.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.20 నుండి 7.54 వరకు, అమృతఘడియలు: రా.12.34 నుండి 2.19 వరకు.

సూర్యోదయం :    6.22
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: సన్నిహితులతో మాటపట్టింపులు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

వృషభం: చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: కొన్ని సమస్యలు తీరతాయి. బంధువుల నుంచి ధనలబ్ధి. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.

కర్కాటకం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

సింహం: వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

కన్య: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

తుల: ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం: విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement