
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.విదియ రా.9.21 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తర రా.2.54 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: ఉ.8.15 నుండి 10.02 వరకు, దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.21 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు,
అమృతఘడియలు: సా.6.54 నుండి 8.40 వరకు;
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
సూర్యోదయం: 6.26,
సూర్యాస్తమయం: 6.01.
మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
వృషభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఇంటాబయటా నిరుత్సాహం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. విలువైన సమాచారం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన పదవులు దక్కుతాయి.
సింహం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. కొన్ని పనులు మందగిస్తాయి. శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో పనిభారం.
కన్య: శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. బంధువుల నుంచి ముఖ్య సందేశం. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.
తుల: పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు: కొత్త మిత్రుల పరిచయం. ఆకస్మిక ధనలబ్ధి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి..
మకరం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కుంభం: బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం.
మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి సహాయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment