
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.చవితి రా.1.04 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: చిత్త పూర్తి (24గంటలు), వర్జ్యం: ప.2.04 నుండి 3.48 వరకు, దుర్ముహూర్తం: ప.11.47 నుండి 12.34 వరకు, అమృత ఘడియలు: రా.12.33 నుండి 2.18 వరకు, సంకటహర చతుర్ధి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 6.01.
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి లాభం. వ్యవహారాలు పురోగతిలో సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం: మిత్రుల ద్వారా ధనలబ్ధి. పరిచయాలు మరింత పెరుగుతాయి. మీ ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మిథునం: సన్నిహితులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. చర్చలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.
సింహం: ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు.
కన్య: వ్యవహారాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ధనవ్యయం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
తుల: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ప్రత్యేక గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
వృశ్చికం: మిత్రుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు: పనులలో ప్రగతి. నూతనోత్సాహం. కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
మకరం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కుంభం: సన్నిహితులే శత్రువులుగా మారవచ్చు. ప్రయాణాలలో అవాంతరాలు. పనుల్లో జాప్యం. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మీనం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విరోధాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment