ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు, నూతన ఉద్యోగయోగం | Today Telugu Horoscope On Feb 29th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు, నూతన ఉద్యోగయోగం

Published Thu, Feb 29 2024 7:05 AM | Last Updated on Thu, Feb 29 2024 8:27 AM

Daily Horoscope Today 29-02-2024 telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.పంచమి రా.2.24 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: చిత్త ఉ.7.34 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ప.1.34 నుండి 3.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.15 నుండి 11.04 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: రా.11.53 నుండి 1.34 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 6.02. 

మేషం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృషభం: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

మిథునం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సన్నిహితులతో మాటపడతారు. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: బంధువులతో సత్సంబంధాలు. కీలక విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చర్చలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాంగా సాగుతాయి.

కుంభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement