Rasi Phalalu: నేటి 12 రాశుల ఫలితాలు ఇలా.. | Today Telugu Horoscope On July 26th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: జులై 26 నేటి రాశి ఫలాలు, 12 రాశుల ఫలితాలు ఇలా

Published Fri, Jul 26 2024 6:40 AM | Last Updated on Fri, Jul 26 2024 9:58 AM

Daily Horoscope Today Telugu July 26 2024 Rasi Phalalu

గ్రహఫలం(Today Horoscope in Telugu).. శుక్రవారం, 26.08.24

మేషం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. విద్యార్థులకు అనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల వృద్ధి. ఉద్యోగాలలో ఉత్సాహం.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో హోదాలు.

వృశ్చికం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మకరం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీనం: మిత్రులతో మరింత సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement