Horoscope Today: 03 July 2023 In Telugu - Sakshi
Sakshi News home page

Today Astrology - ఈ రాశి వారికి  ఆకస్మిక ప్రయాణాలు.. ధనవ్యయం..

Published Mon, Jul 3 2023 7:54 AM | Last Updated on Mon, Jul 3 2023 8:40 AM

Horoscope Today 03 07 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, వైశాఖ మాసం, తిథి: పౌర్ణమి సా 5.29 వరకు, తదుపరి పాడ్యమి, నక్షత్రం: మూల ఉ.11.38 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.10.07 నుండి 11.38 తిరిగి, రా. 8.43 నుండి 10.14 వరకు, దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.57 వరకు, అమృతఘడియలు: తె.5.49 నుండి 7.20 వరకు (తెల్లవారితే మంగళవారం), గురుపౌర్ణమి, వ్యాసపౌర్ణమి;

రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,

యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,

సూర్యోదయం: 5.33,

సూర్యాస్తమయం: 6.35.

మేషం: ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత  నిరాశ కలిగిస్తాయి.

వృషభం: కొత్తగా రుణాలు యత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు.

మిథునం: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.

కర్కాటకం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. 

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం.  వ్యాపారాలు, ఉద్యోగాలు  మందకొడిగా సాగుతాయి. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కన్య: కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. 

తుల: సన్నిహితులు దగ్గరవుతారు. కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. కళాకారులకు సత్కారాలు.

వృశ్చికం: ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు.  బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. 

మకరం: అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు,  వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మీనం: కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది.  శుభవార్తలు వింటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement