
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
తిథి: శు.త్రయోదశి ప.2.06 వరకు, తదుపరి చతుర్దశి,
నక్షత్రం: ఆశ్లేష రా.9.36 వరకు, తదుపరి మఖ,
సూర్యోదయం : 6.20
సూర్యాస్తమయం : 6.03
వర్జ్యం: ఉ.9.11 నుండి 10.56 వరకు,
దుర్ముహూర్తం: సా.4.28 నుండి 5.15 వరకు,
అమృతఘడియలు: రా.7.52 నుండి 9.34 వరకు.
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. చర్చలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
మిథునం: కొత్త రుణయత్నాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనుల్లో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొంత నిరాశ.
కర్కాటకం: వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
సింహం: ఏ పని చేపట్టినా మందకొడిగానే సాగుతుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.
కన్య: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
వృశ్చికం: సేవా కార్యక్రమాలు చేపడతాలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు: ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కుంభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.
మీనం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
Comments
Please login to add a commentAdd a comment