Horoscope Today: April 6, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

నేటి రాశిఫలాలు: ఈ రాశివారికి అనుకోకుం‍డా ధనలాభం, మిగతా రాశులకు ఎలా ఉందంటే..

Published Thu, Apr 6 2023 6:33 AM | Last Updated on Thu, Apr 6 2023 8:30 AM

Horoscope Today 06 04 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ  సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం,
సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  6.10


తిథి: పౌర్ణమి ఉ.9.53 వరకు, తదుపరి బ.పాడ్యమి,
నక్షత్రం: హస్త ప.12.37 వరకు, తదుపరి చిత్త,

వర్జ్యం: రా.8.55 నుండి 10.34 వరకు,
దుర్ముహూర్తం: ఉ.10.01 నుండి 10.49 వరకు తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు,
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ. 6.00 నుండి 7.30 వరకు 

అమృతఘడియలు: ఉ.6.17 నుండి 7.58 వరకు.
 

మేషం: జీవితభాగస్వామి ద్వారా ఆస్తిలాభం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. పనులలలో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. వాహనయోగం. చర్చల్లో పురోగతి.

వృషభం: ఆదాయం అంతగా కనిపించదు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆలయాల దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యభంగం. ధనవ్యయం.

మిథునం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. నూతన విద్యావకాశాలు.

సింహం: రాబడి తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. బంధువిరోధాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. విద్యార్థులకు నిరుత్సాహమే.

కన్య: అనుకోని ధనలాభం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు, సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. వాహనయోగం.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. కష్టపడ్డా ఫలితం ఉండదు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. అనారోగ్య సూచనలు. బంధువులతో మాటపట్టింపులు.

వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. అంచనాలు నిజమవుతాయి. దేవాలయ దర్శనాలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు.

మకరం: పనులు కొన్ని ముందుకు సాగవు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

కుంభం: విద్యార్థుల కృషి ఫలించదు. ఆస్తి వివాదాలు. మానసిక ఆందోళన. అనారోగ్యం. కళాకారులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ప్రయాణాలలో అవాంతరాలు. దైవచింతన.

మీనం: అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement