Horoscope Today: April 7, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

దినఫలాలు: ఈ రాశివారికి మిత్రులతో సమస్యలు, మిగతా రాశువారికి ఎలాగ ఉందంటే..

Published Fri, Apr 7 2023 6:31 AM | Last Updated on Fri, Apr 7 2023 8:26 AM

Horoscope Today 07 04 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం,
సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  6.10


తిథి: బ.పాడ్యమి ఉ.10.11 వరకు, తదుపరి విదియ,
నక్షత్రం: చిత్త ప.1.32 వరకు, తదుపరి స్వాతి,

వర్జ్యం: రా.7.14 నుండి 8.51 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.20 నుండి 9.11 వరకు.. తదుపరి ప.12.25 నుండి 1.16 వరకు,
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 


అమృతఘడియలు: ఉ.7.10 నుండి 9.50 వరకు.

మేషం: ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం.  పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ కృషి ఫలించే సమయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు. వస్తులాభాలు.

వృషభం: దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల సమస్య నుంచి విముక్తి. వాహనసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.

మిథునం: పనులు మధ్యలోనే విరమిస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు.  ఆకస్మిక ప్రయాణాలు.  సోదరులు, మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. బంధుగణంతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్య సూచనలు.

సింహం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి,వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది.

కన్య: ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల యత్నాలు అనుకూలించవు.  దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: ఆసక్తిరమైన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగలాభం. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృథా ఖర్చులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. సమావేశాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మకరం: పనులలో కొంత జాప్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. 

కుంభం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు  వాయిదా. శ్రమ తప్పదు. సోదరులు, మిత్రులతో అకారణ విరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు..

మీనం: మిత్రులే సమస్యలు సృష్టిస్తారు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో అవాంతరాలు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. అనారోగ్యం. భూవివాదాలు. వృత్తి,వ్యాపారాలలో ఒడిదుడుకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement