
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజ శ్రావణ మాసం, తిథి: అమావాస్య ఉ.6.07 వరకు, తదుపరి భాద్రపద శు.పాడ్యమి, నక్షత్రం: ఉత్తర పూర్తి (24గంటలు), వర్జ్యం: ప.1.03 నుండి 2.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.21 నుండి 1.10 వరకు,
అమృతఘడియలు: రా.11.35 నుండి 1.21 వరకు;
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,
సూర్యోదయం: 5.51, సూర్యాస్తమయం: 6.02.
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. ఇంటాబయటా అనుకూలం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు.
వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యుతో స్వల్ప విభేదాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మిథునం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటకం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. దైవదర్శనాలు.
సింహం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
కన్య: పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటుంది.
తుల: పనులలో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయదర్శనాలు. ఆరోగ్యభంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం: కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి,వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. విందువినోదాలు.
ధనుస్సు: ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. మీ అంచనాలు నిజమవుతాయి. బంధువులతో సఖ్యత. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మకరం: శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. మీప్రతిపాదనలు కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
కుంభం: శ్రమాధిక్యం. పనులు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు కలసిరావు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు.
మీనం: ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. అనుకోని సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
Comments
Please login to add a commentAdd a comment