
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.నవమి ప.3.07 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శ్రవణం ప.3.43 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.7.26 నుండి 8.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.07 నుండి 12.54 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.12 వరకు, అమృతఘడియలు: తె.4.23 నుండి 5.55 వరకు, మహానవమి, విజయ దశమి.; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.55, సూర్యాస్తమయం: 5.41.
మేషం: రాబడి మరింతగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగుల ఆశలు ఫలిస్తాయి.
వృషభం: వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు సంభవం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగులకు అదనపు పనిభారం.
మిథునం: ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆరోగ్య సమస్యలు. పనులు వాయిదా వేస్తారు.వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు స్థానచలనం.
కర్కాటకం: ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆస్తి వివాదాలు తొలగుతాయి. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి ప్రశంసలు.
సింహం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. గృహ నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి.రాబడి సంతృప్తినిస్తుంది. ఉద్యోగులకు కీలక మార్పులు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు.
తుల: ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. దేవాలయాలు సందర్శిస్తారు వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు.
వృశ్చికం: రుణబాధలు తొలగుతాయి. బంధువులతో విభేదాలు తీరతాయి. శుభవార్తలు అందుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. వ్యాపారాల విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల సమాచారం.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. పనుల్లో అవాంతరాలు తప్పవు. ఇంటాబయటా సమస్యలు. బంధువులతో విభేదాలు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.
మకరం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.
కుంభం: రాబడి తగ్గి అవసరాలకు అప్పులు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు దగిస్తాయి.దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగులకు స్థానమార్పు.
మీనం: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. సోదరుల నుంచి సహాయం అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment