
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.చవితి రా.10.31 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రేవతి ఉ.10.44 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: తె.5.20 నుండి 6.47 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.21 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృతఘడియలు: ఉ.8.24 నుండి 9.57 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.22, సూర్యాస్తమయం: 6.02.
మేషం... రుణభారాలు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
వృషభం... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు నెరవేరతాయి. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం... కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కర్కాటకం... మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ప్రతిబ«ంధకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.
సింహం.. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
కన్య... కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల.. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. శుభవార్తలు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఎదురుండదు.
వృశ్చికం... కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొంత గందగోళం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
ధనుస్సు... ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ప్రతిష్ఠంభన. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
మకరం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
కుంభం... మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో నిదానం అవసరం.
మీనం... కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. భూవివాదాలు పరిష్కారం. వాహనయోగం. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
Comments
Please login to add a commentAdd a comment