
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: పౌర్ణమి రా.7.07 వరకు, తదుపరి బహుళ పాడ్యమి , నక్షత్రం: ఆశ్లేష రా.7.37 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ఉ.8.06 నుండి 9.42 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.54 నుండి 12.42 వరకు, అమృతఘడియలు: సా.6.01 నుండి 7.38 వరకు, మాఘపూర్ణిమ; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.33, సూర్యాస్తమయం: 5.56.
మేషం.... పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృషభం.... శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొంటారు.
మిథునం.... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. నిరుద్యోగుల యత్నాలలో నిరాశ.
కర్కాటకం.. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు. పరిచయాలు విస్తృతమవుతాయి.
సింహం.... వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా.
కన్య.... నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
తుల... నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులతలో సఖ్యత. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. ఆస్తిలాభం. వాహనయోగం.
వృశ్చికం... చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
ధనుస్సు.... శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో స్వల్ప వివాదాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. అనారోగ్యం. అనుకున్న పనుల్లో జాప్యం. బంధువర్గం నుంచి ఒత్తిళ్లు.
మకరం.... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశలు చిగురిస్తాయి. దైవదర్శనాలు..
కుంభం.... శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు విజయం. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విందువినోదాలు.
మీనం..... కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. ఆస్తి వివాదాలు..
Comments
Please login to add a commentAdd a comment