
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.8.42 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: ధనిష్ఠ సా.4.03 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.10.59 నుండి 12.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.18 నుండి 11.06 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.47 వరకు, అమృతఘడియలు: లేవు
సూర్యోదయం : 6.24
సూర్యాస్తమయం : 6.01
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం..... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పై హోదాలు దక్కుతాయి.
వృషభం... బాకీలు వసూలవుతాయి. వస్తు,వస్త్రలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో ఉన్నతి.
మిథునం...మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం....సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
సింహం...ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కన్య...ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. మిత్రుల నుంచి కీలక సమాచారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
తుల...ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యవహారాలలో కొన్ని ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం...పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉండవచ్చు.
ధనుస్సు....మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు.ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మకరం....మిత్రులతో కొద్దిపాటి విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగానే ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
కుంభం...ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు విస్తరణలో విజయం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మీనం....పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ గౌరవం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయటపడతారు.
Comments
Please login to add a commentAdd a comment