దినఫలం: ఈ రాశివారు శుభవార్తలు వింటారు | Today Telugu Horoscope On September 28th 2023: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారు శుభవార్తలు వింటారు, మిగతా రాశులవారికి ఇలా..

Published Thu, Sep 28 2023 6:38 AM | Last Updated on Thu, Sep 28 2023 9:33 AM

Rasi Phalalu Today Daily Horoscope 28 09 2023 Telugu - Sakshi

గ్రహఫలం.. గురువారం,28.09.23

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం,
సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.51

 
తిథి: శు.చతుర్దశి సా.6.26 వరకు, తదుపరి పౌర్ణమి, 
నక్షత్రం: పూర్వాభాద్ర రా.2.49 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర,

వర్జ్యం: ఉ.10.24 నుండి 11.53 వరకు, 
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.41 వరకు, తదుపరి ప.2.38 నుండి 3.26 వరకు,
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు 

అమృత ఘడియలు: రా.7.21 నుండి 8.51 వరకు, అనంతపద్మనాభ వ్రతం. 

మేషం: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు.

కర్కాటకం: మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. అనుకోని ధనవ్యయం.

సింహం: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కన్య: వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు.

తుల: పనులలో జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. శుభవార్తలు వింటారు.

వృశ్చికం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

ధనుస్సు: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. అనుకోని ప్రయాణాలు.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి.  ఉద్యోగాలలో పురోగతి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.

మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువులను కలుసుకుంటారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement