
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,
సూర్యోదయం: 6.35, సూర్యాస్తమయం: 5.54.
తిథి: బ.తదియ తె.4.28 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి చవితి,
నక్షత్రం: పుబ్బ సా.6.56 వరకు, తదుపరి ఉత్తర,
వర్జ్యం: రా.2.40 నుండి 4.22 వరకు,
దుర్ముహూర్తం: ప.11.52 నుండి 12.36 వరకు,
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
అమృతఘడియలు: ప.11.58 నుండి 1.44 వరకు;
మేషం: పరిస్థితులు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
వృషభం: సన్నిహితులు, శ్రేయోభిలాషులతో కలహాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.
కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో గందరగోళం. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
సింహం: శుభవర్తమానాలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యవహారాలలో విజయం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపార, ఉద్యోగాలు కలసివస్తాయి.
కన్య: సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు రద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు.
వృశ్చికం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం. దైవదర్శనాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
ధనుస్సు: రుణభారాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.
మకరం: బంధువులతో తగాదాలు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం: సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. ఆదాయానికి ఇబ్బందులు తీరతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.
మీనం: కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment