ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయం, ఆకస్మిక ధనలాభం | Today Horoscope: February 22, 2024 In Telugu | Sakshi

ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయం, ఆకస్మిక ధనలాభం

Published Thu, Feb 22 2024 6:23 AM | Last Updated on Thu, Feb 22 2024 8:21 AM

Today Horoscope 22 February 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: శు.త్రయోదశి ప.1.45 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: పుష్యమి సా.5.14 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.10.17 నుండి 11.05 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృత ఘడియలు: ఉ.10.22 నుండి 12.04 వరకు.

సూర్యోదయం :    6.28
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు

 

మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు. 

వృషభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. 

మిథునం: పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. .

కర్కాటకం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

సింహం: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. 

కన్య: సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి. 

తుల: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం. 

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. 

ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. 

మకరం: పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు అందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు శుభవార్తలు. దైవదర్శనాలు. 

కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు.పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటి నిర్మాణయత్నాలు. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement