Sakshi Today Horoscope Of April 29th 2023 In Telugu, Check Daily Astrological Predictions - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఏప్రిల్‌ 29 రాశిఫలాలు: ఈ రాశివారు సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు

Published Sat, Apr 29 2023 6:52 AM | Last Updated on Sat, Apr 29 2023 8:47 AM

Today Horoscope 29 04 2023 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం,
సూర్యోదయం: 5.40, సూర్యాస్తమయం: 6.14. 
తిథి: శు.నవమి ప.4.58 వరకు, తదుపరి దశమి,
నక్షత్రం: ఆశ్లేష ఉ.11.46 వరకు, తదుపరి మఖ,

వర్జ్యం: రా.1.03 నుండి 2.47 వరకు,
దుర్ముహూర్తం: ఉ.5.41 నుండి 7.21 వరకు,
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు,
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు,


అమృతఘడియలు: ఉ.10.01 నుండి 11.43 వరకు;

మేషం: కుటుంబసమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మిథునం: ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూవివాదాల పరిష్కారం. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

సింహం: బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. ధనవ్యయం.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

తుల: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

ధనుస్సు: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మకరం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement