
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం,
తిథి: శు.నవమి ఉ.8.47 వరకు, తదుపరి దశమి,
నక్షత్రం: ఉత్తర రా.1.57 వరకు, తదుపరి హస్త,
సూర్యోదయం: 5.29, సూర్యాస్తమయం: 6.26.
వర్జ్యం: ఉ.7.43 నుండి 9.29 వరకు,
దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.57 నుండి 3.51 వరకు,
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
అమృతఘడియలు: సా.6.10 నుండి 7.34 వరకు;
మేషం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృషభం: సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు కుదించుకుంటారు. విలువైన పత్రాలు జాగ్రత్త. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మిథునం: ఎంత శ్రమపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కర్కాటకం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
సింహం: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
కన్య: మీ కష్టం ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.
తుల: వ్యయప్రయాసలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. ప్రయాణాలలో అవాంతరాలు. మానసిక ఆందోళన . వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.
వృశ్చికం: నూతన ఉద్యోగాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తుల వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనూహ్య ప్రగతి.
ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మకరం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం: పరిస్థితులు అనుకూలించవు. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. .అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.
మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment