Today's Horoscope In Telugu: 30-07-2023- Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయం, వస్తులాభం

Published Sun, Jul 30 2023 7:26 AM | Last Updated on Sun, Jul 30 2023 10:24 AM

Today Horoscope In Telugu 30 07 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ  మాసం, తిథి: శు. ద్వాదశి ఉ.7.08 వరకు, తదుపరి త్రయోదశి తె.5.13 వరకు (తెల్లవారితే సోమవారం), నక్షత్రం: మూల రా.7.44 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.6.13 నుండి 7.45 వరకు, తదుపరి తె.4.53 నుండి 6.24 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.47 నుండి 5.39 వరకు, అమృతఘడియలు: ప.1.31 నుండి 3.04 వరకు.

సూర్యోదయం        :  5.41
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. 

వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. ఆప్తులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. 

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. 

కర్కాటకం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు సన్మానాలు. 

సింహం: పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. బాధ్యతలు అధికమవుతాయి. 

కన్య: కొత్త రుణయత్నాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఉద్యోగులకు మార్పులు. 

తుల: పనులలో అనుకూలం. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారవృద్ధి. విద్యార్థులకు మంచి ర్యాంకులు. 

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయదర్శనాలు. 

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో పురోగతి. 

మకరం: పనులు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవచింతన. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. బంధువుల కలయిక. 

కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. 

మీనం: వ్యవహార విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement