
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.దశమి ఉ.7.28 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుబ్బ రా.7.21 వరకు తదుపరి ఉత్తర, వర్జ్యం: రా.3.14 నుండి 5.02 వరకు, దుర్ముహూర్తం: ప.11.22 నుండి 12.18 వరకు, అమృత ఘడియలు: ప.12.14 నుండి 2.02 వరకు, రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం : 6.05, సూర్యాస్తమయం : 5.24
మేషం.. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. శ్రమానంతరం పనులు పూర్తి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
వృషభం... రాబడి నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మిథునం.... కాంట్రాక్టులు దక్కుతాయి. పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
కర్కాటకం... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
సింహం..... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కన్య.... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
తుల... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. పనులు సకాలంలో పూర్తి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృశ్చికం... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. కొత్త కార్యక్రమాలు చేపడతారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.
ధనుస్సు.... మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
మకరం.... దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
కుంభం... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం... శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. విలువైన సమాచారం. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment